Madanam Gangadhar DSP
Madanam Gangadhar from Nizamabad is Contesting as the MLC Candidate for Nizamabad-Adilabad-Karimnagar-Medak Graduate Election
ఖాకీ డ్రెస్ వదిలి.. ఖద్దర్ బట్టలతో ‘‘పొలిటికల్’’ ఎంట్రీ
ఎస్ఐ గా పోలీసు జీవితాన్ని ప్రారంభించి సీఐ, డీఎస్పీగా విధులు నిర్వహించిన గంగాధర్... 26 యేళ్లుగా విజయవంతంగా పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. పోలీసు జీవితానికి స్వస్తిపలికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటున్నారు గంగాధర్.
Join Our Whatsapp Channel
ఉద్యోగం ద్వారా కంటే.. రాజకీయంగా సేవ చేసేందుకు మరింత అవకాశం ఉండడంతో.. ఎన్నికల బరిలోకి..
మదనం గంగాధర్ స్వస్థలం.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్. భిక్షాటనే వృత్తిగా చేసుకునే జీవించే సంచార జాతికి చెందిన వ్యక్తి ఆయన. చిన్ననాటి నుంచి పని చేసుకుంటూనే కష్టపడి చదువుకున్నారు. ఆ క్రమంలో నిజామాబాద్‌లో జీజీ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ప్రవేశం పొందారు. దీంతో ఆయన జీవితం మలుపు తిరిగింది. అలా 22 ఏళ్ల వయస్సులో తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐగా మదనం గంగాధర్ సెలెక్టయ్యారు. అలా 1998 బ్యాచ్‌లో ఎస్‌ఐగా చేరారు. 2010లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఆయనకు పదోన్నతి లభించింది. అయితే తన 26 ఏళ్ల సర్వీసులో వృత్తిపట్ల నిబద్దతతో పని చేశారు. అలాగే ఎవరి పట్ల నిస్పక్షపాతంగా వ్యవహరించ లేదు. పోలీస్ శాఖలో చేరిన కొన్ని సంవత్సరాలకే.. కఠిన సేవా, ఉత్తమ సేవా, ముఖ్యమంత్రి సర్వోన్నత పతకాలను ఆయనను వరించాయి. ఇప్పటి వరకు దాదాపు 200 రివార్డులను సైతం గంగాధర్ అందుకున్నారు. ఓ పోలీస్ అధికారిగా నేరాలు నియంత్రించడంతోపాటు ప్రజలను జాగృతి చేయడంతో ఆయన నూటికి నూరు శాతం సఫలీకృతుడయ్యారు వ్యవస్థలో.. సమాజంతోపాటు వ్యక్తుల స్వభావంలో మార్పు రావాలని గంగాధర్ ఆకాంక్షిస్తారు. అందుకు ఆయన తన వంతు కృషి చేస్తున్నారు.
సాధించిన కొన్ని విజయాలు..
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో పేపర్ లీక్ దర్యాప్తుతోపాటు దేశ భద్రతకు సంబంధించిన అతి పెద్ద కేసుల విచారణలో సైతం గంగాధర్ పాల్గొన్నారు
నల్గొండలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని భావించి.. వాటిని ఆదిలో నియంత్రించగలిగాను. దీంతో ఉన్నతాధికారుల ప్రశంసలకు సైతం ఆయన పాత్రుడయ్యారు. ఇక పోలీస్ శాఖలో చేరిన కొన్ని సంవత్సరాలకే.. కఠిన సేవా, ఉత్తమ సేవా, ముఖ్యమంత్రి సర్వోన్నత పతకాలను ఆయనను వరించాయి.
సంస్థాన్ నారాయణ్‌పూర్ గ్రామస్తులు చికున్ గున్యా బారిన పడిన సమయంలో.. మెడికల్ క్యాంపులు నిర్వహించి.. వారికి అందించిన సేవలను వారు నేటికి మరువ లేక పోవడం గమనార్హం.