మదనం గంగాధర్ స్వస్థలం.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్. భిక్షాటనే వృత్తిగా చేసుకునే జీవించే సంచార జాతికి చెందిన వ్యక్తి ఆయన. చిన్ననాటి నుంచి పని చేసుకుంటూనే కష్టపడి చదువుకున్నారు. ఆ క్రమంలో నిజామాబాద్‌లో జీజీ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ప్రవేశం పొందారు. దీంతో ఆయన జీవితం మలుపు తిరిగింది. అలా 22 ఏళ్ల వయస్సులో తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐగా మదనం గంగాధర్ సెలెక్టయ్యారు. అలా 1998 బ్యాచ్‌లో ఎస్‌ఐగా చేరారు. 2010లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఆయనకు పదోన్నతి లభించింది. అయితే తన 26 ఏళ్ల సర్వీసులో వృత్తిపట్ల నిబద్దతతో పని చేశారు. అలాగే ఎవరి పట్ల నిస్పక్షపాతంగా వ్యవహరించ లేదు. పోలీస్ శాఖలో చేరిన కొన్ని సంవత్సరాలకే.. కఠిన సేవా, ఉత్తమ సేవా, ముఖ్యమంత్రి సర్వోన్నత పతకాలను ఆయనను వరించాయి. ఇప్పటి వరకు దాదాపు 200 రివార్డులను సైతం గంగాధర్ అందుకున్నారు. ఓ పోలీస్ అధికారిగా నేరాలు నియంత్రించడంతోపాటు ప్రజలను జాగృతి చేయడంతో ఆయన నూటికి నూరు శాతం సఫలీకృతుడయ్యారు వ్యవస్థలో.. సమాజంతోపాటు వ్యక్తుల స్వభావంలో మార్పు రావాలని గంగాధర్ ఆకాంక్షిస్తారు. అందుకు ఆయన తన వంతు కృషి చేస్తున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటున్నారు గంగాధర్.
Home About