కరీంనగర్ పట్టభద్రుల నియోజక వర్గ అభ్యర్థి డీఎస్పీ గంగాధర్ ఓటర్ల నాడిని పట్టుకున్నారు. పట్టభద్రులైన ఓటర్లలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఓటుకు నోటు, మద్యం సరఫరా, విందులు అనే సంస్కృతికి స్వస్తీ పలుకడానికి సామాన్యుడిలా పట్టభద్రులను కలిసి ముచ్చట పెడుతున్నారు. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలలో సుడిగాలి పర్యాటన చేశారు డీఎస్పీ గంగాధర్.
ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల కేంద్రంలో గల జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో ‘మార్నింగ్ వాకర్స్’ తో కలిసి వాకింగ్ చేసి పట్టభద్రులతో ఆయన ముచ్చటించారు. పట్టభద్రులను కలిసి తాను కరీంనగర్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నాడో వివరిస్తున్నారు. ఐపీఎస్ అయ్యే అవకాశంను వదులు కొని డీఎస్పీ పదవికి రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయాలనే ఒకే లక్ష్యంతో మీ ముందుకు వస్తున్నాని చెబుతున్నారు గంగాధర్. దయచేసి తనకు ఓటు వేస్తే రాజకీయాలలో పెను మార్పులు తీసుకు రావడానికి ప్రయత్నిస్తానని చెబుతున్నారు. ఈ సందర్బంగా డీఎస్పీ గంగాధర్ కు శాలువతో సన్మానం చేశారు.