జాతీయ జెండాతో డీఎస్పీ గంగాధర్ ప్రచారం

0
24

డీఎస్పీ మధనం గంగాధర్ స్టైలే వేరు. కరీంనగర్ పట్టభద్రుల నియోజక వర్గంలో ప్రచారంలో దూసుకు పోతున్నారు. అట్టడుగు వర్గం నుంచి వచ్చిన గంగాధర్ సక్సెస్ పుల్ పోలీసు ఆఫీసర్ గా ప్రజల మెప్పు పొందిన తన దైన శైలిలో జాతీయ జెండాను చేత పట్టుకుని ఓటరులను చైతన్య వంతులను చేయడమే గాకుండా తనకు ఓటు వేయాలని వేడుకుంటున్నారు.

జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శనివారం కరీంనగర్ ఎస్ ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తున్న పట్టభద్రుల వద్దకు డీఎస్పీ గంగాధర్ జాతీయ జెండాను పట్టుకుని హల్ చల్ చేశారు. ఓటుకు నోటు అనే సంస్కృతికి భిన్నంగా సామాన్య పౌరుడిలా వెళుతున్న కరీంనగర్ పట్టభద్రుల నియోజక వర్గ అభ్యర్థి డీఎస్పీ గంగాధర్ ను ప్రచారంలో దూసుకు పోతున్నారు.

మార్నింగ్ వాకార్స్ మరియు క్రీడాకారులతో కలిసి ఓటరు దినోత్సవ ఉద్దేశాన్ని వివరించారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటరుల పాత్ర కీలకమని ఆయన గుర్తు చేస్తున్నారు. డబ్బును ఏరగా చూపి ఓటు కోసం వచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

విద్యావంతులైన తాము భావి తరాలకు ఆధర్శంగా నిలువడానికి పట్టభద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీగా తనను గెలిపించాలని డీఎస్పీ గంగాధర్ వేడుకున్నారు. ఎన్నికలలో డబ్బుతోనే గెలువాలనే ధ్యేయంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

చట్టం, న్యాయం, ధర్మం పట్ల పూర్తి అవగాహన, నిబద్ధత గల తనకు పూర్తి మద్దతు ఇవ్వాలని డీఎస్పీ గంగాధర్ విజ్ఞప్తి చేశారు. పోలీసు ఆఫీసర్ గా 200 లకు పైగా అవార్డులు అందుకున్న తన పని తీరును గుర్తించి ఎమ్మెల్సీగా మరింతా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కల్పించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here